సెల్ఫీ సరదా తొలిసారి ప్రాణం తీసింది

February 19, 2016 | 12:47 PM | 7 Views
ప్రింట్ కామెంట్
Rare Dolphin Dies Being Passed Around For Selfies niharonline

నేటి యువతరం సెల్ఫీ సరదాతో ప్రాణాలు తీసుకోవటమే కాదు, అవతలి ప్రాణాలను కూడా తీసేస్తున్నారు. ఓ సెల్ఫీ తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి,  సంబరపడిపోయే రోజులివి. అయితే లైక్ ల కోసం వారే చేసే సరదా వారి ప్రాణాలు తీయటమే ఇప్పటిదాకా చూశాం. కానీ, ఇప్పుడు అదే సరదా పాపం ఓ  ప్రాణం బలి తీసుకుంది.

అర్జెంటీనాలోని శాంతా తెరిసితా బీచ్ లో చిన్న డాల్ఫిన్ ఒకటి ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. లాప్లాటా డాల్ఫిన్ అని పిలువబడే అది అరుదైన జాతికి చెందింది. దీంతో ఆ మూగజీవితో సెల్ఫీ దిగాలని భావించిన వందలాది మంది ఎన్నో పోజులిచ్చారు. నీటి నుంచి బయటకు తీసి ముద్దు చేస్తూ, పోజులిచ్చారు. నీరు లేకపోతే అది చనిపోతుందన్న విషయం మరిచి మరీ ఫోటోలు దిగారు. దీంతో ఆ డాల్ఫిన్ మరణించింది. ఈ ఘటనపై అర్జెంటీనా వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ మండిపడింది. సెల్ఫీ పిచ్చితో మూగజీవాల ప్రాణాలు తీయటం సరికాదని హెచ్చరించింది. మూగజీవాలతో సెల్ఫీ తీసుకోవాలనుకోవటం ఓకేగానీ, అందుకోసం దాని ప్రాణాలే తీయటం ఏంటని సోషల్ మీడియాలో సైతం ఆ సెల్ఫీలకు తిట్లు పడుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ