టెన్సిస్ బ్యూటీ మరియా షరపోవా తనకెంతో ఇష్టమైన వైన్ ను తాగడం మానేయాలని నిర్ణయించుకుందట. త్వరలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పోటీల కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం ఆమె ర్యాకింగ్స్ లో నంబర్ 2 స్థానంలో ఉంది. ఈ టోర్నీ గనుక గెలిస్తే 1వ ర్యాంకుకు కైవసం చేసుకుంటుంది. తనను తాను నిరూపించుకోవటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ అందాల టెన్నిస్ సుందరి తెలిపింది. కాగా, షరపోవా 2008లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచింది. మొత్తం 5 గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న షరపోవా మరోసారి మెల్బోర్న్ పార్క్ లో సత్తా చాటాలని భావిస్తోంది.