ఆ స్కూల్లో చదివే ఉగ్రవాదులయ్యారంట

December 09, 2015 | 04:51 PM | 2 Views
ప్రింట్ కామెంట్
Tashfeen-Malik-california-christmas-firing-niharonline

కాలిఫోర్నియాలోని శాన్‌బెర్నార్డినో ప్రాంతంలోని ఓ వికలాంగుల కేంద్రంలో క్రిస్మస్ హాలిడే పార్టీ పై ఆగంతకులు కాల్పులకు తెగబడటంతో 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీస్ కాల్పుల్లో ఘటనకు బాధ్యులైన ఇద్దరిని కాలిఫోర్నియా పోలీసులు హతమార్చారు. వీరిద్దరూ దంపతులు కావటం విశేషం. వీరిలో తష్ఫీన్‌ మాలిక్‌ (27 గురించి విచారించిన పోలీసులకు విస్తూ పోయే విషయం ఒకటి భయటపడింది. మహిళా ఉగ్రవాది అయిన రిజ్వాన్‌ ఫరూక్‌ (28) అనే టెర్రరిస్ట్ ను పెళ్లి చేసుకుది. అంతేకాదు తష్పీన్ మాలిక్ చదివిన స్కూల్ ఉగ్రవాదులకు ట్రెయినింగ్ ఇచ్చేదట. ఆమెతోపాటు విద్యాభ్యాసం పూర్తి చేసిన మరో నలుగురు కూడా ఉగ్రవాదులుగా మారారని కెనడా అధికారులు చెబుతున్నారు.

పాకిస్థాన్ లోని ముల్తాన్ లో గల ఇన్స్ టిట్యూట్ ఆఫ్ పాకిస్థాన్ అల్ హుదా పాఠశాలకు కెనడాలో ఓ బ్రాంచ్ ఉంది. దీనిని 2004లో ఇస్లామిక్ స్కాలర్ ఫర్హాత్ హష్మీ స్థాపించింది. ముల్తాన్ లోని పాఠశాలలో తష్పీన్ మాలిక్ చదువుకుంది. కెనడాలోని బ్రాంచ్ లో విద్యాభ్యాసం పూర్తి చేసిన 16 నుంచి 20 ఏళ్ల లోపున్న నలుగురు అమ్మాయిలు నేరుగా ఉగ్రవాదుల్లో చేరారని, వారిలో ముగ్గురు టర్కీలోను, ఒకరు సిరియాలోను ఉన్నట్టు ఆధారాలు లభించాయని అధికారులు వెల్లడించారు. దీంతో ఆ స్కూల్ ను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఇక తుపాకులతో దాడులకు పాల్పడే ముందు ఆ దంపతులు 28 వేల డాలర్లు అప్పు తీసుకున్నట్టు ఎఫ్ బీఐ దర్యాప్తులో వెలుగు చూసింది. ఈ 28 వేల డాలర్లు ఏం చేశారు? ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు అప్పు తీసుకున్నారు? అనే అంశాలపై ఎఫ్ బీఐ అధికారులు ఆరాతీస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ