ఇది మాత్రం ఉల్లిపాయ ఏడుపు కాదు

January 13, 2016 | 03:02 PM | 2 Views
ప్రింట్ కామెంట్
americans-crying-selfie-for-obama-niharonline

సామాజిక మాధ్యమాల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు వెరైటీ సెల్ఫీలతో వీడ్కోలు పలుకుతున్నారు అమెరికన్లు. ఇకపై ఆయన అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉండబోరన్న విషయం అమెరికన్ల మదిలో తీరని బాధను కలిగిస్తోంది. మృదు స్వభావిగా, నిత్యమూ ప్రజలతో కలిసుంటూ, వివాదాస్పద నిర్ణయాలకు దూరంగా ఉంటూ, వైట్ హౌస్ లో ఉన్నా, తనదైన శైలిలో ప్రజల్లో కలిసిపోయి పాలన సాగించిన నేతగా పేరు తెచ్చుకున్న ఒబామా, జాతిని ఉద్దేశించి చేసిన చివరి ప్రసంగం తరువాత సామాజిక మాధ్యమాల్లో ఎంతో మంది 'తమకు ఏడుపు వస్తోంది' అని చెబుతూ కన్నీటి సెల్ఫీలను పోస్ట్ చేస్తున్నారు.

                     "బరాక్, మీరు దూరం కావద్దు" అని ఒకరు, "మిస్టర్ ప్రెసిడెంట్ మీరే కొనసాగాలి" అని ఇంకొకరు, "మీరు లేని వైట్ హౌస్ ను ఊహించలేకపోతున్నాం" అని మరొకరు, "మీరు చివరి ప్రసంగం చేస్తున్నారంటే నమ్మలేకున్నాం"... ఇలా సాగుతున్నాయి ట్వీట్లు. వీరందరినీ ఉద్దేశించి ఒబామా సైతం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. తానెక్కడికీ వెళ్లడం లేదని, ప్రజల్లో కలిసేందుకు వస్తున్నానని బదులిచ్చారు.

కాగా, ఒబామా కన్నీళ్లపై సెటైర్లు వేసిన కన్జర్వేటివ్ పొలిటికల్ ఎనలిస్టు, ఫాక్స్ న్యూస్ చానెల్ వ్యాఖ్యాత ఆండ్రియా టాంటెరోస్ కు ఈ సందర్భంగా పలువురు చురకలు అంటించారు. ఆయన ఏడ్పు అబద్ధం అయితే ఇంత మంది ఆయన కోసం ఎందుకు ఏడుస్తారని ఆమెను ప్రశ్నించారు.
 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ