దేవుడా...! అరగంట లేకపోతేనే అల్లలాడిపోయారు

January 27, 2015 | 01:29 PM | 35 Views
ప్రింట్ కామెంట్

సందు దొరికితే చాలు ఇప్పుడున్న జనాలు సోషల్ మీడియా లోకంలో విహరిస్తూనే ఉంటారు. ఆఫీస్సుల్లో, కాలేజీల్లో, బస్ స్టాప్ ల్లో, ఆఖరికి రోడ్లమీద కూడా ఎక్కడ బడితే అక్కడ క్షణం తీరిక దొరికినా ఫేస్ బుక్, వాట్సాప్ అంటూ మునిగిపోతుంటారు. మంగళవారం మధ్యాహ్నం కలిగిన చిన్న అవాంతరం వారిని ఉక్కిరి బిక్కిరి చేసింది. ఫేస్ బుక్, వాట్స్యాప్ లు సాంకేతిక సమస్యలతో నిలిచిపోయాయి. ఈ రెండింటితోపాటు ఇన్ స్టాగ్రామ్ కూడా ఆగిపోయింది. మధ్యాహ్నం 12 నుంచి ఫేస్ బుక్ పనిచేయకుండా పోయింది. దీంతో వినియోగదారులు అల్లాలాడిపోయారు. ఈ పరిస్థితి సుమారు అరగంటకు పైగా సాగింది. చివరకు సమస్యను పరిష్కరించి సేవలు ప్రారంభించినట్లు ఫేస్ బుక్, వాట్సాప్ లు తెలిపాయి. అంతరాయానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నాయి. కాగా, ఈ అరగంట మాత్రం ఫేస్ బుక్ లేని ప్రపంచం ఎలా ఉంటుందన్న విషయం నెటిజన్లకు తెలిసి వచ్చింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ