ఓవైపు తమ విపరీత చేష్టలతో నిండు ప్రాణాలను బలి తీసుకుంటూ రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారు ఉగ్రరాక్షసులు. మతం ముసుగులో వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. అలాంటి వారికే భలే షాకిచ్చాడు ఓ టెక్కీ. గత వారం రోజులుగా ఉగ్రవాద సంస్థలకు చెందిన పలు వెబ్ సైట్లను కొన్ని సంస్థలు హ్యాక్ చేశాయి. మరెన్నో సైట్లను 'డార్క్ వెబ్'లోకి పంపిచేశారు. ఇక ఇప్పుడు గుర్తుతెలియని సంస్థ ఐఎస్ ప్రధాన వెబ్ సైట్ కే ఎర్త్ పెట్టింది.
ఐఎస్ఐఎస్ ప్రధాన వెబ్ సైట్ ను హ్యాక్ చేసి ఆ ప్లేసులో వయాగ్రా మాత్రల ప్రకటనలు ఉంచారు. "ఈ యాడ్ చూసి మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోండి. మేము మా మౌలిక వసతులను మరింతగా పెంచుకుని ఐఎస్ఐఎస్ చెప్పాలనుకున్నదాన్ని ఇంకా గట్టిగా చెబుతాం" అంటూ ఆ పేజీలో వ్యాఖ్యానిస్తూ, 'టూ మచ్ ఐఎస్ఐఎస్' అని టైటిల్ ఉంచారు.. ఓ ఆన్ లైన్ ఫార్మసీ యాడ్ ను ఈ పేజీలో చేర్చారు. మిగతా ఉగ్రవాదులకు చెందిన సమాచారాన్ని చెరిపేశారు. ఇంతకు ముందు గుర్తితెలియని సంస్థ 20,000 ఐఎస్ ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేయగా, పారిస్ దాడుల అనంతరం ఉగ్రసంస్థల సైట్లను హ్యాక్ చేయటం ఎక్కువైపోయింది.