ప్రపంచ వ్యాప్తంగా పేరున్న హాలీవుడ్ స్టార్ జాకీ చాన్ కొడుకు గతేడాది డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఉదంతం అందరికీ తెలిసిందే. తాజాగా జాకీ చాన్ కొడుకు జాయ్ సీ చాన్‌కు చైనాలో కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. డ్రగ్స్ కేసులో అతనికి ఈ శిక్షతో పాటు 326 డాలర్ల జరిమానా విధించింది. తన స్నేమితుడైన తైవాన్ మూవీ స్టార్ కై కో చెన్ తుంగ్ తో కలిసి డ్రగ్స్ సేవిస్తూ గతేడాది ఆగస్టులో జాయ్ సీ చాన్ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణ అనంతరం అతనికి బీజింగ్ డొంగ్ చంగ్ జిల్లా ప్రజా కోర్టు ఆరు నెలల శిక్ష తో పాటుగా జరిమాని విధిస్తూ తీర్పు చెప్పింది.