ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దారుణాలు రోజురోజుకు శ్రుతిమించిపోతున్నాయి. తాజాగా విడుదల చేసిన ఒక వీడియోలో పదేళ్ల బాలుడి చేత ఇద్దరు వ్యక్తులను చంపించారు. రష్యా గూఢాచారులుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరిని ఐఎస్ కాల్చిచంపింది. ఓ బాలుడికి ఏకే-47 తుపాకీ ఇచ్చి వీరి తలలోకి కాల్పులు జరిపించారు. అంతకుముందు వీరిని తీవ్రంగా హింసించారని శరీరంపై ఉన్న గాయాల ఆధారంగా తెలుస్తోంది. రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ)తనను నియమించిందని మరణించే ముందు ఒక వ్యక్తి చెబుతున్నట్లు వీడియోలో ఉంది. సిరియాలో తిరుగుతూ ఐఎస్ యుద్ధవీరుల సమాచారాన్ని చేరవేస్తున్నట్లు వీడియోలో వారిద్దరు అంగీకరించారు.