బాధంతా భార్య గిఫ్ట్ కొసమేనట...!

December 16, 2014 | 11:52 AM | 33 Views
ప్రింట్ కామెంట్

అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడే అయినా, ఆయనా ఓ మహిళకు భర్తే. రానున్న క్రిస్మస్ ను తలచుకుని బరాక్ ఒబామా ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. ఎందుకంటే, ప్రతి క్రిస్మస్ కు కుటుంబానికి కానుకలు అందించడం ఒబామాకు ఎంతో ఇష్టం. పెద్ద కుమార్తె మలియా (16) ఏం తీసుకువచ్చినా సంతోషిస్తుందని, భార్య మిచెల్లీ మాత్రం ఓ పట్టాన ఇష్టపడదని తన ఆందోళనకు కారణం తెలిపారు. ఆమె చాలా ఫ్యాషనబుల్, చూడ్డానికి బాగుంటుంది. ఇప్పుడామెకు ఎలాంటి దుస్తులు కొనాలన్నదే సమస్యగా మారింది. సినిమాలు ఎక్కువగా చూసే మలియాకు ఓసారి 100 గ్రేటెస్ట్ సినిమాలను బహుకరించాను, ఆమె ఆ కానుకను ఎంతో ఇష్టపడింది. కానీ, మిచెల్లీ కోసం షాపింగ్ చేయడం చాలా కష్టం అని ఒబామా వివరించారు. కాగా, శుక్రవారం ఒబామా తన కుటుంబంతో హవాయి వెళతారు. ప్రతి ఏడాది ఆయన అక్కడే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ