హిట్లర్ బొమ్మకు కోటి రూపాయలు

November 24, 2014 | 03:34 PM | 35 Views
ప్రింట్ కామెంట్

అడాల్ఫ్ హిట్లర్… జర్మనీతోపాటు ప్రపంచాన్ని కూడా గడగడలాడించిన ఓ నియంతగానే మనకు తెలుసు. కానీ, ఇప్పుడు ఆయన గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. నాజీ నియంతంగా ఎదగడానికి రెండు దశాబ్ధాల క్రితం కుటుంబ భారం కోసం ఆయన చిత్రకారుడిగా పనిచేశారట. ఆ సమయంలో ఆయన వేసిన చిత్రాలలో ఒకటైన మ్యునిచ్ పాత నగరం యొక్క చిత్రాన్ని శనివారం వేలంపాట వేశారు. వాటర్ పెయిటింగ్ అప్పటికీ ఇది 1,62,000 డాలర్లు(సుమారు రూ.99.32 లక్షలకు) రికార్డు ధరకు అమ్ముడుపోయిందట. హిట్లర్ గీసిన చిత్రాలలో అధిక ధరకు అమ్ముడుపోయిన చిత్రం ఇదే కావడం విశేషమని నురెంబర్గ్ పట్టణంలోని వేలంపాట నిర్వహకులు తెలిపారు. అయితే దీన్ని కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను మాత్రం వారు వెల్లడించలేదు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ