యువతిని నగ్నంగా నడిపించిన కేసులో తీర్పు

December 30, 2015 | 03:01 PM | 3 Views
ప్రింట్ కామెంట్
11 women convicted for stripping parading woman naked

యువతిని బలవంతంగా వీధిలోకి ఈడ్చుకొచ్చి, బట్టలు తీసి నగ్నంగా పరేడ్ చేయించిన కేసులో 11 మంది మహిళలు, ఓ పురుషుడికి రెండేళ్ల జైలుశిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ, ముంబై సెషన్స్ కోర్టు తీర్పిచ్చింది. ముంబైలోని సేవ్రీ సమీపంలో 22 ఏళ్ల యువతిపై జరిగిన ఈ అకృత్యంపై వివరాల్లోకి వెళితే...  2010, జూన్ లో యువతి సోదరుడు ఓ నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేశాడన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆగ్రహావేశాలకు గురైన పలువురు మహిళలు ఆమెపై దాడికి దిగారు. అసభ్యకరంగా ప్రవర్తించారు. అప్పట్లో ఈ ఘటన ముంబైలో సంచలనం కలిగించింది.

                      దాదాపు ఐదేళ్లు కోర్టు విచారణ సాగగా, వీరికి శిక్ష విధించేందుకు చట్టం సరిపోదని డిఫెన్స్ చేసిన వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇది ఘోరమైన ఘటనని, బాధితులు రెండు వైపులా ఉన్నప్పటికీ, మహిళల ప్రవర్తన సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేసిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. యువకుడి కుటుంబానికి గుణపాఠం చెప్పేందుకే వారు ఈ పని చేసి వుంటారని భావించినప్పటికీ, అది సభ్య సమాజంలో దుర్మార్గమైన చర్యేనని వెల్లడించారు. అయితే మహిళలపై ఆరోపించిన కుల ఆధారిత వేధింపుల సెక్షన్లు మాత్రం తొలగిస్తున్నట్టు తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ