సెలబ్రిటీ మేకకు మాత్రమే బెయిల్ దొరికింది

February 10, 2016 | 05:35 PM | 2 Views
ప్రింట్ కామెంట్
goat-got-bail-in-chhattisgarh-niharonline

దర్జాగా కలెక్టర్ గారి తోటలోకి ప్రవేశించి అక్కడి పూల తోటలను ధ్వంసం చేస్తూ, అరెస్టయిన బుజ్జి మేకకు బెయిలొచ్చింది. మీడియాలో జరిగిన ప్రచారంతో ఆ మేక రాత్రికి రాత్రే సెలబ్రిటీగా మారిపోగా, జంతు సంఘాల వారు మేకను అరెస్ట్ చేయడం ఏంటంటూ బాహాటంగానే విమర్శలు చేశారు. ఇక దీన్ని కోర్టు ముందు హాజరు పరచగా, బెయిల్ మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు. మేక యజమాని అబ్దుల్ హసన్ కు మాత్రం ఇంకా బెయిలు లభించలేదు. చత్తీస్ గడ్ రాష్ట్రంలోని కలెక్టర్ హేమంత్ రాత్రే ఇంటి తోటలోని కూరగాయలను, పూలను ఇది పాడుచేస్తున్నదన్న ఫిర్యాదుతో ఆమధ్య దీన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్నిసార్లు చెప్పినా అతను మేకను అదుపు చేయకపోవడంతో విసిగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అబ్దుల్‌ హాసన్‌ను, మేకను కూడా అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. కాగా, ఈ కేసులో వారిని దోషులుగా న్యాయస్థానం నిర్ధారిస్తే రెండు నుంచి ఏడేళ్ల వరకు శిక్ష, జరిమానా పడే అవకాశం ఉండేది. అయితే, మేకగారు మాత్రం ముందుగా బెయిల్‌పై విడుదలయ్యారు. ఓనర్ గారు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ