కేంద్రం గిల్లింది వారు రెచ్చిపోతున్నారు

January 07, 2016 | 12:55 PM | 1 Views
ప్రింట్ కామెంట్
odisha-protest-over-polavaram-against-AP-govt-niharonline

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై వైఖరి అనుమానాలకు తావునిస్తుంది. రోజు రోజుకి జరుగుతున్న పరిణామాలు ఈ విషయంలో నెలకొనే సందేహాలను మరింత బలపరుస్తున్నాయి. నవ్యాంధ్రకు వరప్రదాయనిగా మారనున్న ఈ ప్రాజెక్టును వచ్చే ఐదేళ్లలో ఎలాగైనా పూర్తి చేయాలని గట్టి పట్టుదలతో ఓవైపు సీఎం చంద్రబాబు కూడా భీష్మించుకున్నారు. అయితే జాతీయ హోదా ప్రకటించినట్టే ప్రకటించి అరకోర నిధులను విడుదల చేస్తున్న కేంద్రం ఆ మధ్య ప్రాజెక్టు నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం నుంచి అడ్డంకులు ఉన్నాయని, వారితో కూర్చుని మాట్లాడుకోవాల్సిందిగా ఏపీ ప్రభుత్వానికి సూచించింది. ఇక కేంద్రం నుంచి ప్రకటన వెలువడిన కొద్దిరోజులకే ఒడిశా నిరసనలకు దిగింది.

                          తాజాగా పోలవం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఒడిశాలో బీజేడీ పార్టీ ఆందోళన నిర్వహిస్తోంది. ఈ క్రమంలో రాయగఢలో రైళ్ల రాకపోకలను బీజేడీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దాంతో కోరాపూట్-విశాఖ ప్యాసింజర్ ను నిలిపివేశారు. అంతేగాక పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ఈ ఆందోళనతో పార్వతీపురం-ఒడిశా మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులను కూడా నిలిపివేశారు. పార్వతీపురం-రాయగఢ్, శ్రీకాకుళం-రాయగఢ్, పార్వతీపురం-నారాయణపూర్ మధ్య బస్సు సర్వీసులను రద్దు చేశారు. మొత్తం మీద ఇరు రాష్ట్రాల మధ్య రవాణావ్యవస్థలను స్తంభింపజేసేందుకు ఒడిశా ప్రయత్నాలు చేస్తోంది. నిధుల విషయంలో జాప్యం ప్రకటించినా ఫర్వాలేదు కానీ, ఇలా పక్క రాష్ట్రాలను కెలికి మరీ ప్రాజెక్టుకు అవాంతరాలు కల్పించటం ఎంత వరకు కరెక్టని అన్ని పక్షాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. ప్రాజెక్టుతో పెద్ద ప్రమాదమేమీ లేదని చెబుతున్నప్పటికీ ఒడిశా లేవనెత్తుతున్న అభ్యంతరాలు ఆశ్చర్యం కలిగించేవిగా ఉన్నాయన్నది విశ్లేషకుల వాదన కూడా.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ