ఆస్తుల్ని జప్తు చేస్తామంటూ కలాంకి నోటీసులు!!!

December 05, 2015 | 10:46 AM | 1 Views
ప్రింట్ కామెంట్
apj_abdul_kalam_BSNL_notice_niharonline

మిస్సైల్ మ్యాన్, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చనిపోయి దాదాపు నాలుగు నెలలు కావస్తోంది. మరి అలాంటప్పుడు చోద్యంగా ఆయన ఆస్తులు జప్తు చేస్తామని ఇప్పుడోక నోటీసు అందడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆయన బాకీ పడ్డది ఎంతో తెలుసా? కేవలం 1029 రూపాయలు మాత్రమే. ఆయన గొప్పతనాన్ని ప్రపంచమంతా గుర్తించినప్పటికీ మన టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ మాత్రం గుర్తించనట్లుంది. అంతే కాదు ఆయన చనిపోయిన విషయం కూడా వారికి గుర్తు లేదేమో! తమకు బకాయిపడ్డ ఈ స్వల్ప మొత్తాన్ని చెల్లించాలని మీ ఆస్తులు జప్తు చేస్తాం అంటూ కలాంకు బీఎస్ఎన్ఎల్ ఓ నోటీసు జారీ చేసింది. అంతేకాక బకాయి చెల్లించని పక్షంలో ఆయనకు చెందిన చరాస్తులను జప్తు చేయాలని కూడా తన క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆ సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.

                        తిరువనంతపురం పర్యటనలో భాగంగా ఆయన కేరళ రాజ్ భవన్ లో రెండు రోజుల పాటు బస చేసిన సందర్భానికి సంబంధించిన బిల్లట. ఇక ఏ తేదీతో నోటీసు జారీ అయ్యిందో తెలుసా?... 18, నవంబరు, 2015 తేదీతో..అంటే కలాం చనిపోయిన నాలుగు నెలలకన్నమాట. ఇక ఈ నోటీసుల గురించి తెలుసుకున్న కేరళ రాజ్ భవన్ వర్గాలు షాక్ కు గురయ్యాయి. దీనిపై మరింత చర్చ జరగకముందే, ఆ బిల్లును తాను చెల్లిస్తామంటూ కేరళ రాజ్ భవన్ బీఎస్ఎన్ఎల్ కు తెలిపాయి. అబ్దుల్ కలాం అంటే అది కేవలం పేరు కాదు భారత దేశ కీర్తి ప్రతిష్ట. అలాంటి మనిషిని అవమానిస్తూ ఇంత చిన్న మొత్తం కోసం రాద్ధాంతం చేయటం, అది కూడా ఓ ప్రభుత్వ రంగ సంస్థ నుంచి కావటంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ