సీక్రెట్ సెక్స్ రాకెట్ తో పోలీసులే షాకయ్యారు

May 10, 2016 | 11:58 AM | 4 Views
ప్రింట్ కామెంట్
secret-brothel in-lodge-bangalore-niharonline

పాత సినిమాల్లో విలన్ లు డెన్ లుగా సీక్రెట్ రూమ్ లు కట్టి వాడేసుకోవటం, హీరో జేమ్స్ బాండ్ తరహాలో దానిని కనుగోని వారి భరతం పట్టడం మనం చూశాం. కానీ, ఇక్కడో లాడ్జి యజమాని ఏకంగా వ్యభిచార గృహం నడిపేందుకు ఏకంగా ఓ ఫ్లోర్ నే సీక్రెట్ రూంలతో నింపేశాడు. రైడింగ్ కు వెళ్లిన పోలీసులు ఈ హైటెక్ సెక్స్ రాకెట్ చూసి నోళ్లు వెళ్లబెట్టారు. వివరాళ్లోకి వెళ్లితే... బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ హెడ్ క్వార్టర్స్ కు దగ్గర్లోనే ఉండే శివ ప్యాలెస్ డీలక్స్ లాడ్జ్. రెండేళ్లుగా ఆ లాడ్జిపై వస్తున్న ఫిర్యాదు పక్క రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తెప్పించి వ్యభిచారం చేయిస్తున్నారని. ఒకటి, రెండు సార్లు కాదు. ఏకంగా ఆరు సార్లు ఆ హోటల్ పై పోలీసులు దాడి చేసి అణువణువూ గాలించారు అయినా చిన్న క్లూ దొరకలేదు. అయితే ఏడోసారి మాత్రం వాళ్ల పప్పులు ఉడకలేదు..

                                           తనిఖీలకు వెళ్లిన ఇన్ స్పెక్టర్ ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లకు మధ్య ఎత్తు చాలా ఎక్కువగా ఉన్నట్టు కనిపించడంతో అనుమానం మొదలయ్యింది. తనిఖీలు చేయగా, ఓ సీక్రెట్ డోర్ బయటపడిందట. తెరిచి చూస్తే అక్కడ తక్కువ ఎత్తులో ఉన్న ఫ్లోర్, కొన్ని గదులు, అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు దారి ఉంది. అవాక్కయిన పోలీసులు, బీహార్, బెంగాల్ అమ్మాయిలతో పాటు, సెక్స్ రాకెట్ నిర్వాహకులనూ, లాడ్జి యజమానిని అరెస్ట్ చేశారు. అసలు హోటల్ కు వెళ్లిన వారికి అక్కడ ఒక ఫ్లోర్ ఉందన్న అనుమానమే కలగని విధంగా దీన్ని డిజైన్ చేశారట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ