ఢిల్లీలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బిజినెస్ గురించి మాట్లాడటానికి వచ్చిన మహిళా పారిశ్రామికవేత్తపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ దారుణంపై సదరు మహిళా పారిశ్రామికవేత్త కన్నాట్ ప్లేస్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఛండీగఢ్ కు చెందిన సదరు దుండగుడు వ్యాపారం గురించి మాట్లాడదామంటూ మహిళా పారిశ్రామికవేత్తకు కబురుపెట్టాడు. అతడి దుర్బుద్ధిని గమనించని బాధితురాలు నేరుగా హోటల్ కు వెళ్లింది. హోటల్ లో మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ను ఆ దుర్మార్గుడు మహిళా పారిశ్రామికవేత్తకు ఆపర్ చేశాడు. దానిని తాగిన మహిళా పారిశ్రామికవేత్త స్పృహ తప్పింది. ఇదే అదనుగా అతడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అతడు ఆమెను అక్కడే వదిలేసి వెళ్లాడు. తీరా మెలకువ వచ్చిన తర్వాత జరిగిన దారుణాన్ని గుర్తు చేసుకున్న బాధితురాలు నేరుగా కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం వేట ప్రారంభించారు.