గోవా మంత్రి దీపక్ ధవళికర్ భార్య వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. అత్యాచారాలు పెరగడానికి కారణం యువత పాశ్చాత్య సంస్క్రుతిని అనుకరించడమని ఆయన భార్య లత పేర్కొన్నారు. బొట్టుపెట్టుకోవడం, జడ వేసుకోవడం అమ్మాయిలు మరిచిపోయారని ఆమె తెలిపారు. అంగాంగ ప్రదర్శన కోసం బిగుతైన దుస్తులు వేసుకుంటున్నారని ఆమె వెల్లడించారు. సెక్సీనెస్ అంటూ అమ్మాయిలు అసభ్యకర రీతిలో బట్టలు వేసుకుని ఎక్స్ పోజింగ్ చేస్తున్నారని, ఇది చూసి యువత అమ్మాయిలపై వ్యామోహం పెంచుకుని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆమె అన్నారు. అలాగే పాశ్చాత్య సంస్క్రుతిని అనుకరించే స్కూళ్లకు పిల్లలను పంపకుండా, విద్య నేర్పే స్కూళ్లకు పిల్లల్ని పంపాలని ఆమె సూచించారు. అలాగే హలో, హాయ్ కు బదులుగా నమస్కారం అనాలని ఆమె చెప్పారు. జనవరి 1వ తేదీకి బదులు గుడిపడ్వాను నూతన సంవత్సరంగా చేసుకోవాలని ఆమె అంటున్నారు. ఇక ఆమె వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.