యాజ్ యూజ్ వల్: ఆ రోజు కనిపిస్తే అంతే!

February 04, 2015 | 04:43 PM | 36 Views
ప్రింట్ కామెంట్

ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల పండగకు జంటలు సిద్ధమైపోతున్నాయి. ముఖ్యంగా భారత్ లో ఓవైపు వారి సన్నాహాలలో వారు మునిగిపోతుంటే... మరోవైపు హిందుత్వ సంస్థలు ప్రతిఘటించేందుకు రెడీఅవుతున్నాయి. ప్రేమికుల రోజు అంటే ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు అపురూపంగా భావిస్తాయి. కానీ, ఒక్క మనదేశంలోనే దానికి భిన్నంగా వాతావరణం ఉంటుంది. ఎప్పటిలాగానే జంటలు కనబడితే చాలు వారికి బలవంతంగా పెళ్లిళ్లు చేసేస్తామని వారు ప్రకటిస్తున్నారు. మరీ ముఖ్యంగా కులాంతరం ఉన్నవారైతే ముందుగా వారికి శుధ్ధికరణ చేసి తర్వాత అధికారికంగా ఆర్యసమాజ్ తరహాలో వివాహాలు చేయిస్తామని చెబుతున్నారు. పండగకి ఇంకా పదిరోజుల ముందుగానే ఇలా వార్నింగ్ లు ఇవ్వటం ప్రారంభించటంతో ప్రేమ పక్షుల్లో గుబులు నెలకొంది. మరోపక్క ప్రేమను పవిత్రంగా భావించే భారత్ లాంటి దేశంలో 365 రోజులు ప్రేమికుల దినోత్సవం జరుపుకోవాలని అంతేకానీ, ఆ ఒక్కరోజే (ఫిబ్రవరి 14) ఎందుకు ప్రత్యేకం అని హిందూ మహసభ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌశిక్ ప్రశ్నిస్తున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ