ఆ నగరం మొత్తం బాంబు మీద కూర్చుంది

December 14, 2015 | 04:18 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Lakhs_at_risk_as_Jabalpur_sits_on_Kargil_duds_and_Russian_RDX

అది మధ్యప్రదేశ్ లోని జబల్ ఫూర్ నగరం. కొద్దిరోజులుగా అంతుచిక్కని రీతిలో బాంబు పేలుళ్లు సంభవిస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఖర్గీచి నగర్ లో చలిమంట పెట్టుకున్నారు ఓ ఇద్దరు యువకులు. కాస్త గొయ్యి తీసి వారా మంటను పూడ్చారు. అంతే ఢామ్ మని దద్దరిల్లిన శబ్ధం. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే స్థానికులు అక్కడికి గుమిగూడారు. చిన్న పేలుడే అయినప్పటికీ ఆ ఇద్దరు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇది అక్కడ గత కొద్దిరోజులుగా జరుగుతున్న తతంగు. ప్రస్తుతం ఏ చిన్న పొరపాటు జరిగినా సరే జబల్ పూర్ నగరం మొత్తం సమాధి అయ్యే ప్రమాదం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

దీనికి కారణం లేకపోలేదు. 1999 లో జరిగిన కార్గిల్ యుద్ధం సమయంలో పేలని, తిరస్కరించిన బాంబులన్నింటినీ ఖమారియాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో భూగర్భంలో పాతి పెట్టారు. లక్షకుపైగా 84 ఎంఎం మోర్టార్లు, ఎల్ 70, బీఎంపీ 2 షెల్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇక దానికి దగ్గర్లోనే కార్గిల్ వార్ సమయంలో పేలుడు పదార్థాలను ఉంచిన ప్రాంతం ఉంది.  మ్యాగజీన్ ఎఫ్12 గా పిలవబడే ఈ ప్రాంతంలో ఎన్నో బాంబులను దాచిపెట్టినట్లు చెబుతారు. రష్యా ఎగుమతి సంస్థ రోసోబోరోన్ ఎక్స్ పోర్ట్ సంస్థ ఎగుమతి చేసిన 4 వేల కిలోల ఆర్డీఎక్స్ పేలుడు నాణ్యతా పరీక్షలో విఫలం కావడంతో జబల్ పూర్ కిందే దాచారు. ఈ నేపథ్యంలో ఇవి ఉన్న ప్రదేశంలో ఎలాంటి పేలుడు జరిపినా, అగ్ని ప్రమాదం జరిగిన, చిన్న మంటపెట్టినా తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. నగరం మొత్తం బుగ్గిపాలైపోతుందన్న భయాందోళనలో స్థానికులు ఉన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ