మ్యాగీ మళ్లీ వచ్చేస్తుందండోయ్

November 04, 2015 | 04:27 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Nestle-start-sale-Maggi-again-niharonline

బస్ దో మినిట్స్ అంటూ ప్రజలందరికీ పసందైన ఫుడ్ గా మారిపోయినా మ్యాగీ తిరిగి మార్కెట్లో ప్రత్యక్షం కానుంది. మ్యాగీ పని ఇక అయిపోయినట్లే, దాదాపు కనుమరుగైనట్టే అనుకున్న క్రమంలో తిరిగి ఉత్పత్తిని ప్రారంభించేందుకు సంస్థ ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఈ నెలలోనే మార్కెట్లోకి మ్యాగి కొత్త సరుకు వస్తున్నట్లు నెస్లే సంస్థ ప్రతినిధులు చెప్పారు. కొత్తగా తయారు చేసిన మ్యాగీ ఉత్పత్తులకు ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ లలో నిర్వహించిన పరీక్షల్లో క్లీన్ చిట్ లభించిందని తెలిపారు.

కర్నాటకలోని నంజన్ గడ్, పంజాబ్ లోని మోగా, గోవాలోని బిచోలిమిలలో ఉన్న మ్యాగీ ప్లాంట్లలో కొత్త సరుకును తయారు చేశామన్నారు. ఎన్ఏబీ గుర్తింపు పొందిన ల్యాబ్ లలో కొత్తగా తయారు చేసిన మ్యాగీ న్యూడిల్స్ కి నిర్వహించిన పరీక్షలో ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదన్నారు. బాంబే హైకోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా తయారు చేసిన మ్యాగీ న్యూడిల్స్ కి ఈ పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. మ్యాగీ నూడిల్స్ మసాలా ఉత్పత్తులను ఈ నెలలోపే తిరిగి మార్కెట్లోకి విడుదల చేస్తామని, ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల అధికారులతో సంప్రదింపులు జరుపుతామని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గండాలు తొలగి క్లియరెన్స్ దొరికితే మాత్రం మ్యాగీ తిరిగి మనింట్లో సందడి చేయటం ఖాయం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ