ఢిల్లీలోని నోయిడాలో ట్రాఫిక్ పోలీసులు నిబంధనలపై వినూత్న రీతిలో ప్రచారం చేపట్టారు. నిబంధనలు పాటించే వాహనదారులకు గులాబీలు ఇస్తున్నారు. అంతేగాదు, హెల్మెట్ లేకుండా వచ్చే ద్విచక్రవాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు కూడా అందిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకే ఇలా వ్యవహరిస్తున్నామని నోయిడా ట్రాఫిక్ ఎస్పీ ఆర్ఎన్ మిశ్రా తెలిపారు. గ్రామీణ్ వికాస్ ఉత్థాన్ సమితి సహకారంతో ఈ 'గులాబీ' కార్యాచరణకు తెరదీశారు. తాము హెల్మెట్లు కూడా ఉచితంగా అందిస్తున్నామని, ఎందరో మోటార్ సైక్లిస్టులు హెల్మెట్లు ధరించని కారణంగా జరిమానాకు గురవుతున్నారని మిశ్రా పేర్కొన్నారు.