ప్రపంచకప్ లో భారత జట్టు ఓటమి పైన సంచలన వ్యాఖ్య చేసిన రాంగోపాల్ వర్మకు జమ్ము కశ్మీర్ మాజీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా గట్టి కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్లో వివాదాస్పద కామెంట్స్ చేసే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఈసారి క్రికెట్‌పై తన బాణాలు ఎక్కుపెట్టిన విషయం తెలిసిందే. క్రికెట్‌ను విపరీతంగా ద్వేషించే వర్మ.. భారత్ ఓటమి నాకు చాలా ఆనందం కలిగించిందని, ఎందుకంటే నాకు క్రికెట్ అంటే ఇష్టముండదని, క్రికెట్‌ను అభిమానించేవారంటే అస్సలు ఇష్టం ఉండదని ట్వీట్ చేశాడు. దీనిపై ఒమర్ అబ్దుల్ తనదైనశైలిలో శుక్రవారం ట్వీట్ చేశారు. 'అన్ని వేళలా నీ సినిమాలు కూడా అలాగే బ్లాక్ బ్లస్టర్ అవుతాయి కదా' అంటూ వ్యంగ్య ట్వీట్ వదిలారు. అన్ని సమయాల్లో రాము సినిమాలు అలాగే బ్లాక్ బస్టర్ అవుతాయి కదా అని ఎద్దేవా చేశారు. మీ సినిమాలు ప్రతి సమయంలోను మంచి హిట్లవుతాయి.. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదని సెటైర్ వేశారు. ప్రపంచ కప్ పోరులో భారత జట్టు బాగా ఆడిందని మెచ్చుకున్నారు. ఓటమిపై అతివాద చర్యలకు పాల్పడుతున్న వారిని అభిమానులు అనడం సరికాదని అభిప్రాయపడ్డారు.