2జీ కేసుకు కొత్త బాసొచ్చారు!

November 22, 2014 | 12:42 PM | 44 Views
ప్రింట్ కామెంట్

దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన 2జీ స్పెక్ట్రమ్ స్కాంకు సంబంధించిన కేసు పర్యవేక్షణను సీబీఐ అదనపు డెరైక్టర్ ఆర్ కే దత్తాకు అప్పగించారు. సరైన పురొగతి సాధించలేనందున సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హాను 2జీ దర్యాప్తు నుంచి సుప్రీంకోర్టు తప్పించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సీబీఐలోని అవినీతి నిరోధక విభాగానికి ఇంచార్జ్ గా వ్యవహారిస్తున్న రూపక్ కుమార్ దత్తా 1981 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి. నిజానికి ఈ కేసును రూల్స్ ప్రకారం ఆర్ కే దత్తాకు అప్పగించాల్సింది కాదు. సీబీఐలో ర్యాంకుల వారీగా చూస్తే రంజిత్‌సిన్హా తర్వాత స్పెషల్ డైరక్టర్ అనిల్ సిన్హా రెండో స్థానంలో ఉన్నారు. కేసు తీవ్రతను బట్టి రంజిత్‌సిన్హా తర్వాత సీనియర్ అధికారికే దర్యాప్తు బాధ్యతలు అప్పజెప్పాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దీంతో ఇకపై 2జీ కేసు దర్యాప్తు బృందానికి ఆర్ కే దత్తా నేతృత్వం వహించనున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ