ఉత్తర ప్రదేశ్ లోని బమ్నులి గ్రామానికి ఆస్ట్రేలియా భారత్ మ్యాచ్ చాలా స్పెషల్ అట. అందుకే మ్యాచ్ సందర్భంగా గురువారం ఆ ఊరికి ఏకంగా సెలవు ప్రకటించేశారు. అంతేకాదు గ్రామంలోని మొత్తం జనాభా 12 వేల మందికి పనులకు సెలవు ప్రకటించి, మ్యాచ్ వీక్షించేందుకు స్క్రీన్ లు ఏర్పాటు చేయించారు ఆ గ్రామపెద్దలు. కారణమేంటనుకుంటున్నారా?. ఏంలేందండి.. భారత జట్టు స్టార్ ఆటగాడు సురేష్ రైనాకు కాబోయే అత్తగారి ఊరు ఇదే. ఏప్రిల్ 3న గ్రామానికి చెందిన ప్రియాంకా చౌదరిని రైనా పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో ఆ ఊరి పెద్దలు ఇలా నిర్ణయం తీసుకున్నారు. దేశానికి గర్వకారణమైన రైనా తమ గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకోవటం తమకు గర్వకారణమని గ్రామ పెద్ద తేజ్ పాల్ సింగ్ వ్యాఖ్యానించాడు. ఇది తమ ఊరికి దక్కిన గౌరవమని ఆయన అన్నాడు.