అబ్బా! యూపీలో గవర్నమెంట్ జాబా? ఎంత హాయో...

April 21, 2015 | 11:11 AM | 47 Views
ప్రింట్ కామెంట్
UP_govt_employees_holidays_niharonline

ఉత్తరప్రదేశ్ లో ఎందుకు పుట్టలేదా? అని ఉద్యోగులు, విద్యార్థులు అనుకోవాలేమో! ఎందుకంటే, ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు సెలవు రాజకీయాలు నడిపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోనే అత్యధిక సెలవులు ఇస్తున్న రాష్ట్రంగా ఉన్న యూపీ మరిన్ని రోజులను సెలవు దినాల్లో చేర్చింది. దీంతో ఇకపై ఉద్యోగులు ఆరు నెలలు సెలవులు అనుభవించి, ఆరు నెలలు పనిచేస్తే చాలు. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్యోగ వర్గాల మెప్పుకోసం అఖిలేష్ యాదవ్ మరో మూడు సెలవులను అదనంగా కలిపారు. మాజీ ప్రధానులు చరణ్ సింగ్, చంద్రశేఖర్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ ల జయంతి ఉత్సవాలను సెలవులుగా నిర్ణయించారు. వీరందరి జన్మదినోత్సవాలు జరుపుకోవటం వల్ల ప్రజలందరు వీరిని ఆదర్శంగా తీసుకోగలుగుతారని ప్రభుత్వం చెబుతోంది. ఇక ఈ తాజా సెలవులతో జాబితా 38 కి పెరిగింది. ఇప్పటికే వారంలో 5 రోజులు మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సీఎల్, ఈఎల్, పండగ సెలవులు తదితరాలన్నీ కలిపితే వారు పనిచేసే కాలం ఆరు నెలలకు తగ్గుతుంది. అదీ సంగతి మరీ.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ