ఆల్క లాంబా... ఆమ్ ఆద్మీ పార్టీ తరపున చాందినీ చౌక్ నుంచి ఎన్నికైన ఎంఎల్ఏ, ఢిల్లీ టూరిజం పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కవి మిరాజ్ గాలిబ్ నివసించిన భవనాన్ని పరిశీలించేందుకు ఆమె వచ్చారు. ఆ సమయంలో అనే ఓ 20 ఏళ్ల యువకుడు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడట. కన్ను కొట్టి మరీ దగ్గరికి వచ్చి తాకేందుకు యత్నించాడట. దీన్ని గ్రహించిన ఆల్క వాడి చెంప పగలకొట్టిందట. దీంతో ఆ యువకుడు పరుగు లంఘించుకోగా, అక్కడే ఉన్న పార్టీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఆ యువకుడికి మతిస్థిమితం సరిగ్గా లేదని బందువులు చెబుతుండగా, అందుకు తగిన మెడికల్ ఆధారాలు చూపలేదని ఆల్క ఆరోపించారు. కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు.