కూతురు కనిపించట్లేదని ఆశ్రయిస్తే... లేచిపోయిందేమో అన్న పోలీసులు

February 07, 2015 | 11:59 AM | 29 Views
ప్రింట్ కామెంట్
UP_law_student_murder_case_niharonline

ఉత్తరప్రదేశ్ లో గౌరి శ్రీవాస్తవ(20) అనే న్యాయ విద్యార్థిని హత్య కేసు ఉదంతం కలకలం రేపిన విషయం తెలిసిందే. గత మంగళవారం అద్రుశ్యం అయిన ఆ అమ్మాయిని కొందరు కిరాతంగా చంపారు. ఓ జంతు వధశాలలో బతికుండగానే ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టి విద్యుత్ రంపంతో కాళ్లు, చేతులు, తల ఇలా ముక్కలు ముక్కలు చేసి సంచిలో మూటగట్టి పడేశారా రాక్షసులు. దొరికిన భాగాలకు పోస్ట్ మార్టం నిర్వహించిన వైద్యులు లైంగికదాడి విషయాన్ని మాత్రం నిర్థారించలేదు. ఇక ఈ ఘటనలో మరో దారుణ విషయాన్ని ఆమె తండ్రి వెల్లడించాడు. తన కూతురు కనిపించట్లేదని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఆ తండ్రితో ‘ఎవడితోనో లేచిపోయి ఉంటుంది’ అంటూ పోలీసుల నుంచి అసభ్యకరమైన సమాధానం వినిపించింది. అంతేకాదు స్టేషన్ నుంచి గెంటేశారని ఆమె తండ్రి శిశిర్ శ్రీవాస్తవ రోదిస్తూ చెప్పారు. ఎవరైనా వస్తే కేసు నమోదు చేసుకోవాల్సిన పోలీసులు గౌరి తండ్రితో ఇలా అవమానకరరీతిలో ప్రవర్తించటం మరో దారుణమని పలు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ కేసులో న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని వారు అంటున్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ