ఆ నిర్ణయంతో క్రుంగిపోడంటున్న యువీ తండ్రి

January 08, 2015 | 01:42 PM | 34 Views
ప్రింట్ కామెంట్

వరల్డ్ కప్ సెలక్టర్ల నిర్ణయం తన కుమారుడిపై ఎలాంటి ప్రభావం చూపబోదని యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ చెబుతున్నాడు. ఛండీగఢ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తన కుమారుడు మళ్లీ జట్టులో చోటు సంపాదిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో చోటు దక్కనంత మాత్రాన యువరాజ్ సింగ్ కుంగిపోడని , మంచులా కరిగిపోయే వ్యక్తి కాదని చెప్పాడు. నేను మా అబ్బాయిని ఆ విధంగా పెంచలేదు. గట్టివాడు యువీ. ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కోవడం తెలిసినవాడు అని వివరించారు. అతనిలో ఆత్మవిశ్వాసం ఎప్పుడూ తొణికిసలాడుతూ ఉంటుందని తెలిపారు. జట్టులో చోటు దక్కనందుకు తాను ఏమీ భాదపడడం లేదని, ఛండీగఢ్ వచ్చి వెంటనే ప్రాక్టీసు మొదలుపెడతానని యువీ తనతో చెప్పినట్టు యోగ్ రాజ్ సింగ్ పేర్కొన్నారు. మాజీ క్రికెటర్ అయిన యోగ్ రాజ్ పలు సినిమాల్లోనూ నటించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ