పెళ్లి కోసం బాహుబలి సెట్లు! ఖర్చు ఎంతంటే...

November 26, 2015 | 11:45 AM | 3 Views
ప్రింట్ కామెంట్
baahubali-sets-for-NRI-daughter-marriage-niharonline

బాలీవుడ్ రికార్డులు తిరగరాయటం మూలాన ఏమో బాహుబలి క్రేజ్ ప్రతీ ఒక్కరికీ ఎక్కేసింది. సినిమా తర్వాత వచ్చిన ప్రతీ పండక్కి, ఈవెంట్లకు బాహుబలి మేనియాను వాడుకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు వ్యాపారవేత్తలు. ఇక జనాలు కూడా ఆ బ్లాక్ బస్టర్ మూవీకి దాసోహమైపోవటంతోపాటు, కాస్త వెరైటీగా భావించి ఆయా ఉత్పత్తులకు ఆకర్షితులైపోతున్నారు. అయితే కేరళకు చెందిన ఓ ఎన్నారై మాత్రం తన కూతురి పెళ్లి కోసం ఏకంగా బాహుబలి సెట్ ను సిద్ధం చేసేస్తున్నాడట.  

రవి పిళ్లై అనే వ్యాపారవేత్త అరబ్ దేశాల్లో మౌలికాభివృద్ధి, గనులు, విద్య తదితర రంగాల్లో సేవలందిస్తున్న ఆర్పీ గ్రూప్ అధినేత. ఆయన 26 కంపెనీలు నిర్వహిస్తుండగా, వాటిల్లో 80 వేల మంది పనిచేస్తున్నారు. కేరళ కేంద్రంగా విదేశాల్లో ఉంటున్న వారిలో అత్యధిక సంపన్నుడు కూడా ఆయనే. అటువంటి బిలియనీర్ తన కుమార్తె వివాహాన్ని అత్యంత ఘనంగా చేయాలనుకున్నాడు. బాహుబలి ఆయన కూడా తెగ నచ్చేసిందో ఏమో, అందులోని సెట్ల తరహాలోనే వివాహ మండపాన్ని తీర్చిదిద్దించాడు.

దీనికి ఆ చిత్రానికి ఆర్ట్ డైరక్టర్ గా పని చేసిన సాబు సిరిల్ కే బాధ్యతలు అప్పజెప్పటం విశేషం. 200 మంది కళాకారులతో సాయంతో సుమారు 20 కోట్ల ఖర్చుతో తిరువనంతపురంలో ఎనిమిది ఎకరాల్లో సెట్టింగులతో ఆయన ఈ దానిని రూపొందించారట. 30,000 మంది కూర్చునేలా పెళ్లి మండపాన్ని రూపుదిద్దారు. వారం రోజులపాటు జరగనున్న ఈ వివాహా వేడుకలకు మొత్తం రూ. 55 కోట్లు ఖర్చవుతుందని భావిస్తుండగా, 42 దేశాల నుంచి వందలాది మంది వీఐపీలు వివాహానికి రానున్నారని తెలుస్తోంది. ఎంటైర్ టెన్మెంట్ లో భాగంగా ప్రముఖ సంగీతకళాకారుడు స్టీఫెన్ డెవస్సే తో మ్యూజికల్ నైట్, హీరోయిన్లు శోభన, మంజు వారియర్ తదితరులు అతిథులను అలరించేందుకు నృత్యాలు చేయనున్నారు. వీఐపీలను మండపానికి చేర్చేందుకు ప్రత్యేక విమానాలూ సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఇండియాలో అత్యంత ఖర్చుతో జరుగుతున్న వివాహ వేడుక ఇదేనట! అదే టైంలో రూ.10 కోట్లతో కాన్సర్ వ్యాధిగ్రస్తులకు సేవాకార్యక్రమాలు నిర్వహించటం విశేషం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ