మ్యాగీని దెబ్బ కొట్టే బ్రాండ్ వచ్చేస్తుంది

October 03, 2015 | 12:46 PM | 2 Views
ప్రింట్ కామెంట్
baba-ramdev-patanjali-noodles-less-cost-niharonline

మ్యాగీ.. మ్యాగీ.. మ్యాగీ... అంటూ టీవీల్లో కొన్నేళ్లుగా సందడి చేసింది. యాడ్ లలో ఇరిటేషన్ వచ్చేలా ప్రకటనిచ్చినా సరే సరే పిల్లలతోపాటు పెద్దలకు కూడా పసంది ఫుడ్ గా మారింది.  త్వరగా అవుతుందన్న ఒకేఒక కారణంతో దానికంత పాపులారిటీ వచ్చింది మరీ. కానీ, గత కొద్ది రోజులుగా దానిటైం ఏం బాగోలేదు. ప్రమాదకర రసాయనాలున్నాయన్న కారణంగా బహుళ జాతి సంస్థ ‘నెస్లే’ తయారు చేస్తున్న ఈ మ్యాగీ నూడుల్స్ పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. కొన్నిరాష్ట్రాల ప్రభుత్వాలు ఏకంగా బ్యాన్ చేసి పడేశాయి. నెలల తరబడి ప్రయోగ శాలల్లో జరిగిన పరీక్షల్లో రసాయనాలున్న మాట వాస్తవమేనని తేలింది. ఈ నేపథ్యంలో మార్కెట్లోని మ్యాగీ స్టాకునంతటిని వెనక్కు తీసుకున్న నెస్లే, ఆ తర్వాత రసాయనాలు లేని మ్యాగీ అంటూ మళ్లీ కొత్తగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ వస్తుంది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

అయితే ఒక్కసారి దెబ్బపడ్డాక ముందులా ఊపు ఉండదు కదా. జరిగిన రాద్ధాంతంతో విక్రయాలు మునుపటిలా లేవట. దీంతో ఇదే అదనుగా భావించిన ఓ బ్రాండ్ వారు నూడుల్స్ ని విడుదల చేసేందుకు రెడీ అయిపోతున్నారు. ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి యోగా కేంద్రం ఉంది కదా. వారు కొత్తగా ‘పతంజలి’ బ్రాండ్ తో నూడుల్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే నూడుల్స్ ఉత్పత్తిని ప్రారంభించిన ఈ యోగా కేంద్రం వారు త్వరలోనే వాటిని మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. అంతేకాదు మ్యాగీ కన్నా శ్రేష్టమైనవి, పైగా ధర అందులో సగం అంటూ ప్రచారంకి సిద్ధమైపోతుంది కూడా. ఒకవేళ అది గనక వర్కవుట్ అయితే మ్యాగీ బ్రాండ్ కనుమరుగవ్వటం తథ్యం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ