సన్యాసిపై సామూహిక అత్యాచారంలో అసలోడు చిక్కాడు

June 18, 2015 | 01:13 PM | 1 Views
ప్రింట్ కామెంట్
bengal_nun_rape_case_main_accused_arrested_niharonline

కోల్ కతా లో  72 ఏళ్ల క్రైస్తవ సన్యాసిపై సామూహిక అత్యాచారం కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం నిందితులలో పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధాన నిందితుడి ఆచూకీ మాత్రం ఇంతకాలం దొరకలేదు. ఎట్టకేలకు ఆ ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దర్జాగా స్థానిక సెల్దా  రైల్వే స్టేషన్ లో దిగుతుండగా నజ్రూల్ అకా నాజూ (28)ను బుధవారం సాయంత్రం  పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం అందుకున్న సీఐడీ పోలీసుల సాయంతో మాటు వేసి అతన్ని అదుపులోకి తీసుకుంది. నిందితుడు ఇంతకాలం బంగ్లా సరిహద్దులో తలదాచుకున్నట్లు విచారణలో తేలిందని సీఐడి  అధికారి చిత్తరంజన్ నాగ్  తెలిపారు. ప్రాథమిక విచారణ అనంతరం  అతడిని రాణాఘాట్  కోర్టులో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. కాగా  కోల్ కతాలో  72 సంవత్సరాల  క్రైస్తవ సన్యాసిపై జరిగిన సామూహిక  అత్యాచారం సంచలనాత్మకం అయ్యింది. నదియా జిల్లాలోని  ఓ కాన్వెంట్ స్కూల్లోకి చొరబడ్డ  దొంగలు ఆ వృద్ధురాలిపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అంతేకాదు లాకర్ లోని దాదాపు 12 లక్షల రూపాయలను  దోచుకెళ్లారు. ఈ ఘటనపై విపక్షాలతోసహా పలు రాజకీయపార్టీలు దేశవ్యాప్త ఆందోళను చేపట్టాయి. పార్లమెంట్ ను సైతం ఈ అంశం కుదిపేసింది. దీంతో  ముఖ్యమంత్రి మమతాబెనర్జీ  సీఐడి దర్యాప్తుకు  ఆదేశించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ