ఫ్లాష్ ఫ్లాష్... బీహార్లో శుక్రవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. బీహార్ పట్టణంలోని ఆరాలోని సివిల్ కోర్టు ప్రాంగణంలో చోటుచేసుకున్న ఈ పేలుడులో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు. శక్తివంతమైన ఈ పేలుడు కారణంగా మరో 12 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. రిపబ్లిక్ డే ఉత్సవాల ద్రుష్ట్యా ఉగ్రవాదులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని భద్రతా సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏకంగా కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుడు జరగటం పెద్ద కలకలం రేగింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు క్షతగాత్రలను ఆస్పత్రికి తరలించి, కోర్టు ప్రాంగణాన్ని తమ అదుపులోకి తీసుకున్నారు. పేలుడుకు కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు కేంద్రం ఈ పేలుడుతో అలర్టయ్యింది. చనిపోయిన వాళ్లలో ఓ మహిళ కూడా ఉంది. ఈమె ఈ పేలుడుకు కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.