ఆ సీఎం సిబ్బందికి ఎన్ని కష్టాలో?

December 23, 2014 | 11:00 AM | 21 Views
ప్రింట్ కామెంట్

సామాన్యంగా ఏ కారో... బస్సో స్టార్టింగ్ ట్రబుల్ ఇస్తే ఏం చేస్తాం. తలా ఓ చెయి వేసి ముందుకు నెడతాం. అదే అన్ని సరిగ్గా ఉన్న విమాన్నాన్ని తోయడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా?. సరిగ్గా ఇక్కడ అట్లాంటి సంఘటనే చోటుచేసుకుంది. అది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రయాణిస్తున్న ప్రత్యేక విమానం. విమానాన్ని రన్ వే మీదకు చేర్చడానికి భద్రతా సిబ్భంది ఓ పట్టుపట్టాల్సి వచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే... చిండ్వారాలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విమానంలో వచ్చారు. ఆపై కొంతసేపటికి ఎంపీ కమల్ నాథ్ ప్రత్యేక విమానంలో చిండ్వారా వస్తున్నారన్న సమాచారం మేరకు సీఎం విమానాన్ని కాస్త పక్కకు జరిపారు. తిరిగి సీఎం బయలుదేరే సమయంలో ఆయన భద్రతా సిబ్బంది విమానాన్ని నెట్టుకుంటూ రన్ వేపైకి తీసుకెళ్లారు. చిండ్వారా విమానాశ్రయం చిన్నగా ఉండటం, పార్కింగ్ సమస్యల కారణంగా ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ