ఢిల్లీ సీఎం అభ్యర్థి బేడీయే... అసమ్మతి సెగ... ఫ్లెక్సీ చించివేత

January 20, 2015 | 10:40 AM | 15 Views
ప్రింట్ కామెంట్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ ని బీజేపీ ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రకటించాడు. ఆమె ఇటీవలె ఆప్ నుంచి బీజేపీ లోకి చేరిన సంగతి తెలిసిందే. ఆమె దేశంలో ప్రప్రథమ మహిళా ఐపీఎస్. గతంలో అన్నాహాజరేతో కలిసి ఆమె అవినీతి వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఆమె అత్యంత సన్నిహితురాలు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆమె ఆప్ తరపునుంచి పోటీ చేశారు ఓడిపోయారు కూడా. ఇటీవలె ఆప్ నుంచి బయటికి వచ్చిన ఆమె కేజ్రీవాల్ పైనే పోటీకి దిగుతానని ప్రకటించడం విశేషం. ఢిల్లీలో మహిళా ముఖ్యమంత్రులే పాలించటం గత దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీ. దీంతో మహిళా అయితేనే ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తుందన్న భావనలో ఉన్న బీజేపీ ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఇక అన్నట్టుగానే తన పాత స్నేహితుడిపైనే పోటీకి దిగేందుకు బేడీ సిద్ధమయ్యారన్నమాట. మరోవైపు ఇటీవలె పార్టీలో చేరిన ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించటంపై ఓ వర్గం నేతలు తీవ్ర అసంత్రుప్తి వ్యక్తంచేస్తున్నారు. సీఎం అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణమే కొంత మంది మద్ధుతుదారులు ఆమె ఫ్లెక్సీని ప్రధాన కార్యలయం బయట ఏర్పాటుచేయగా, వ్యతిరేకదారులు దానిని ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ