మగ పిల్లలు కావాలంటే అక్కడ గాడిదే గతి

March 25, 2016 | 11:22 AM | 4 Views
ప్రింట్ కామెంట్
male-heir-donkey-ride-Junagadh-Borvav-Gujarat-niharonline

ఈ మోడ్రన్ యుగంలో కూడా భార‌తీయుల్లో మూఢ నమ్మకాలు ఎంత పీక్ లో ఉన్నాయో చెప్పేందుకు ఇక్కడ చెప్పబోయేది ఒక మంచి నిదర్శనం. పిల్లల కోసం వైద్య శాస్త్రం లో జెనిటిక్ పద్ధతులను పాటిస్తున్న ఈ రోజుల్లో అక్కడ జనాలు మాత్రం గాడిదను ఆశ్రయిస్తున్నారు. ఔరా అనుకుంటున్నారా? పూర్తి వివరాలు తెలియాలంటే గుజరాత్ వెళ్లాల్సిందే. అక్కడి ఓ గ్రామంలో నేటికీ ఓ విచిత్రమైన ఆచారం కొనసాగుతోంది. గాడిదపై ఊరేగితే మగపిల్లలు పుడతారన్న న‌మ్మకం! అందుకే, ఆ గ్రామంలో గాడిదలకు నేటికీ గిరాకీ కొనసాగడమే కాదు. ఏకంగా జనాలు వెయిటింగ్ లిస్టులో ఉండటం విశేషం.

                          ప్రతీ హోలీ పండగ రోజున జునాగఢ్‌ జిల్లా బోర్వావ్‌ గ్రామంలోని పురుషులు గాడిదలపైకి ఎక్కి ఊరేగుతారు. ముఖ్యంగా మగ సంతానం కోసం మగవారు గాడిద మీద వూరేగుతూ భిక్షాటన చేస్తారు. తొలుత స్థానికంగా ఉండే పక్షులు, జంతువుల ఆహారం కోసం ఈ పద్ధతిని మొదలుపెట్టారు. రాను రాను అలా ఎక్కిన వారందరికీ మగపిల్లలు పుట్టడంతో గ్రామస్థులకు నమ్మకం పెరిగింది. ఈ గ్రామంలో రెండు గాడిదలుండగా వాటి మీద ఎక్కేందుకు స్థానికులు పోటీ పడుతుంటారు. ఈ ఆచారం దశాబ్దాలుగా కొడుకు పుట్టాలని కోరుతూ కొనసాగుతోందని ఆ గ్రామ‌వాసి ఒక‌రు చెప్పారు. నమ్మకంతో దేవుళ్లని మొక్కటం చూశాం కానీ, ఇలా గాడిదలను ఆశ్రయించటం మాత్రం విడ్డూరమే. అయినా ఎవరి నమ్మకాలు వారికుంటాయి. ఏమన్నా అంటే మనోభావాలు దెబ్బతింటాయి!

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ