తొలిసారిగా ఐసీఐసీఐ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డులు

January 09, 2015 | 04:45 PM | 26 Views
ప్రింట్ కామెంట్

ఐసీఐసీఐ బ్యాంక్ తొలిసారిగా కాంటాక్ట్‌లెస్ క్రెడిట్, డెబిట్ కార్డులను ప్రవేశపెట్టింది. ఈ కోరల్ కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డులు, ఎక్స్‌ప్రెషన్స్ వేవ్ డెబిట్ కార్డులు నియర్‌ఫీల్డ్ కమ్యూనికేషన్(ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీతో పనిచేస్తాయని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది. ఈ కార్డులను స్వైప్ చేయాల్సిన అవసరం లేదని, కదిలిస్తే చెల్లింపులు జరిగిపోతాయని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ రాజీవ్ సబర్వాల్ చెప్పారు. ఎన్‌ఎఫ్‌సీ టెక్నాలజీ వల్ల లావాదేవీలు వేగంగా జరుగుతాయని, పైగా అత్యంత సురక్షితంగా కూడా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్డులను మొదటగా హైదరాబాద్, ముంబై, గుర్గావ్‌లో అందించామని పేర్కొన్నారు. ఈ కార్డుల కోసం ఈ నగరాల్లో 1,200 పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్) మెషీన్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఇతర నగరాల్లో వీటిని మామూలు డెబిట్/క్రెడిట్ కార్డులమాదిరిగానే ఉపయోగించుకోవచ్చని తెలి పారు. లావాదేవీలు వేగంగా జరగడం, భద్రతకు ఢోకా లేకపోవడం వంటి అంశాల వల్ల చెల్లింపుల పరిశ్రమలో ఈ కాంటాక్ట్‌లెస్ కార్డులు పెను విప్లవం సృష్టించబోతున్నాయని వివరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ