వాట్సాప్ అడ్మిన్ ల్లారా ఇది మీకోసమే...

October 08, 2015 | 04:36 PM | 2 Views
ప్రింట్ కామెంట్
whatsapp-group-admin-responsible-for-chat-niharonline

సోషల్ మీడియా వాట్సాప్ లో ప్రత్యేకత ఏంటంటే... గ్రూప్ ని క్రియేట్ చేసుకునే సౌలభ్యం. స్కూల్ ఫ్రెండ్స్ కానీ, ఆఫీస్ లో పని చేసేవారు కానీ, ఆఖరికి ఫ్యామిలీ మెంబర్స్ ని ఒక చోటు చేర్చి సరదా సరదా చాట్ లతో గడిపెయ్యటం ఈ గ్రూప్ కున్న ప్రత్యేకత. ఇప్పుడీ నయా ట్రెండ్ అలా సాగిపోతుంది కూడా. ఇక కొత్త కొత్త గ్రూపులు క్రియేట్ చేస్తూ, వాటికి అడ్మిన్ గా ఉండటం గొప్పగా భావిస్తున్నారు కొందరు.

ఓ గ్రూప్ క్రియేట్ చేసి దానిలో ఎంత మంది ఎక్కువ సభ్యులను చేర్చగలిగితే వారు అంత ఎక్కువగా పాప్యులర్ అయినట్టు ఫీలయిపోయి సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడీ వార్త వారికోసమే. గ్రూప్ కు అడ్మిన్ ఉన్నంత మాత్రాన సరిపోదు. గ్రూప్ లో షేరింగ్ అయ్యే కంటెంట్ మొత్తానికీ మీదే బాధ్యతని గుర్తుంచుకోవాలి. ఏ విధమైన తప్పుడు సమాచారం షేర్ అవుతున్నా అరెస్ట్ కూడా కావాల్సి రావచ్చు. విషయం తెలియని ఓ వాట్స్ యాప్ గ్రూప్ అడ్మిన్ ఇలానే ఇప్పుడు జైల్లో పడ్డాడు.

మహారాష్ట్రలోని లాతూర్ సమీపంలో ఈ ఘటన జరిగింది. శివాజీ బర్చే అనే అతను ప్రారంభించిన గ్రూప్ లో ఉన్న మిత్రులెవరో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయగా విషయం పోలీసుల వరకూ వెళ్లింది. దీంతో తాను పెట్టకపోయినా, అడ్మిన్ గా ఉన్నందుకు శివాజీని పోలీసులు బొక్కలోకి తోశారు. అతనితో పాటు మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. సో వాట్స్ యాప్ అడ్మిన్స్... చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వారిని యాడ్ చేయ్యకండి మరి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ