మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరానికి వెళితే అక్కడి ఓ కూడలిలో కనిపించే ట్రాఫిక్ కానిస్టేబుల్ ను చూస్తే మీరు నోరు వెళ్లబెట్టక మానరు. కారణం... అతని విధి నిర్వహణ తీరు విలక్షణం! అందరిలా సాధారణంగా చేతులు ఊపుతూ సైగలు చేయడు. ప్రతి సైగకు కాస్తంత కళాత్మకత అద్దుతాడు. విశ్వవిఖ్యాత డాన్సర్ మైకేల్ జాక్సన్ స్టైల్లో మూన్ వాక్ ను మనోడు అలవోకగా ప్రదర్శిస్తాడు. పైగా ఈ స్టెప్పు అతని వీధుల్లో అందంగా కలిసిపోతుంది. అతని పేరు రంజిత్ సింగ్. నల్లని కళ్లద్దాలు, రెగే స్టయిల్ మీసాలు, చేతికి రిస్ట్ బ్యాండ్ తో అప్ టు డేట్ ఫ్యాషన్ ఫాలోవర్ లా కనిపిస్తాడు. ఇదంతా ఎందకని ప్రశ్నిస్తే ... ఈ విలక్షణతే ప్రజలకు తనను దగ్గర చేసిందని, తద్వారా వారంతా రూల్స్ కరెక్ట్ గా పాటిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఆ రూట్ లో వెళ్లే జనాలు మాత్రం అతగాడి విన్యాసాలను సెల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ ఆనందిస్తున్నారు. ప్రస్తుతం అతగాడి వీడియో ఒకటి యూట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది.