క్వికర్ నిర్వాకం: 5 రూపాయలకే పిల్లాడిని అమ్మిందట

January 24, 2015 | 12:36 PM | 38 Views
ప్రింట్ కామెంట్

ఇంట్లోని పాత వస్తువులు అమ్ముకునేందుకు ఆన్ లైన్ లో రకరకాల వెబ్ సైట్లు సేవలందిస్తుంటాయి. ఈ మధ్య జనాలకు ఇది బాగా వంటపట్టింది. అయితే ప్రముఖ వెబ్ సైట్ క్వికర్ ఇప్పుడో సంచలన వివాదానికి తెరలేపింది. తన సైట్లో ఓ పిల్లాడిని 5 రూపాయలకు అమ్మకానికి పెట్టింది. రాహుల్ ఫర్ సేల్ అనే శీర్షికతో గతేడాది డిసెంబర్ లో 5 రూపాయలకే పిల్లాడిని అమ్మకానికి పెట్టినట్లున్న ప్రకటన ఇఫ్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దీనిపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ తీవ్రంగా స్పందించి కేంద్ర ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లింది. దీనిపై ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ... ఇలాంటి ప్రకటన ఎలా వేశారనే విషయంపై ఆరాతీసునట్లు తెలిపారు. ఇక యాడ్ వివాదం కావటంతో వెబ్ సైట్ నుంచి దీనిని తొలగించింది. కాగా, ఈ ప్రకటనను చెన్నైకి చెందిన వ్యక్తి ఇచ్చినట్లు క్వికర్ పేర్కొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ