జార్ఖండ్ కొత్త సీఎంగా రఘువర్ దాస్

December 26, 2014 | 04:05 PM | 33 Views
ప్రింట్ కామెంట్

జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్(59) భాద్యతలు చేపట్టనున్నారు. ఈమేరకు బీజేపీ శాసనసభా పక్షం శుక్రవారం సమావేశం అయ్యి రఘువర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కాగా జార్ఖండ్ ఏర్పడిన తొలిసారి గిరిజనేతర ముఖ్యమంత్రిగా రఘువర్ దాస్ సీఎం పీఠం ఎక్కబోతున్నారు. మరికాసేపట్లో బీజేపీ అధికారికంగా ప్రకటన చేయనుంది. మరోవైపు ఇప్పటివరకు సీఎం రేసులో ముందున్న మాజీ సీఎం అర్జున్‌ముండా ఎన్నికల్లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో పార్టీ ఉపాధ్యక్షుడు రఘువర్‌ దాస్ (జంషెడ్‌పూర్ ఈస్ట్ ఎమ్మెల్యే)కు ముఖ్యమంత్రి కుర్చీ దక్కింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ