భారతీయ ప్రెస్ కౌన్సిల్ మాజీ చైర్మన్ మార్కండేయ కట్జూ మరోసారి తన నోటికి పనిచెప్పారు. దేశ రాష్ట్రపతి పదవికి బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ అయితే బావుంటుందని ఆమధ్య సూచించిన ఆయన తాజాగా అటువంటి వ్యాఖ్యలే చేశారు. బీజేపీ నేత షాజియా ఇల్మీని బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బావుండేదని, ఆమె కిరణ్ బేడీ కంటే చాలా అందంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ట్విట్ చేశాడు. ఒకవేళ ఇల్మీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే ఆమె తప్పకుండా గెలుస్తుందని జోస్యం చెప్పారు. క్రొయేషియాలా(ఆగ్నేయ యూరప్ లోని ఓ దేశం) ఎన్నికల సమయంలో ను ప్రజలు అందంగా ఉన్నవారికే ఓటు వేస్తారని. షాజియాను బరిలో దింపితే నాలా ఓటు వేయని వారు కూడా ఓటు వేయడానికి వస్తారని చెప్పుకొచ్చారు.