పామును ముక్క ముక్కలుగా కొరికి చచ్చాడు

May 14, 2016 | 03:54 PM | 17 Views
ప్రింట్ కామెంట్
Jharkhand man eats venomous snake after being bitten

ఉత్తర దేశంలో ఆచారాలు, వారు అనుసరించే పద్ధతులే కాదు, ఆపద సమయంలో వారు చేసే పద్ధతులు కూడా విచిత్రంగానే తోస్తాయి. పాము కాటేస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఆస్పత్రికి వెళ్లడమో, లేక సినిమాటిక్ గా అక్కడ కొరికి విషం తీసేసి, ఆపై చికిత్సకి తరలించడం చేస్తుంటారు. అయితే జార్ఖండ్ లో మాత్రం గిరిజనులు విచిత్రమైన పద్ధతిని ఆచరిస్తారు. కాటేసిన పామును కొరికి చంపడం వల్ల శరీరంలోకి ఎక్కిన విషం విరిగిపోతుందని వారి నమ్మకం.

                        ఇక్కడో వ్యక్తి మూడు సార్లు కాటేసిన పామును అతను కసిదీరా కొరికేసి ప్రాణాలు కోల్పోయిన చిత్రమైన ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. లతేహార్ జిల్లాలోని భరియాత్ గ్రామంలో రంతు ఓరన్ (50) అనే వ్యక్తి తన ఇంట్లో నిద్ర పోతున్నాడు. ఇంతలో అతనికి పక్కింట్లోంచి అరుపులు వినిపించాయి. దీంతో ఏం జరిగిందోనన్న ఆందోళనతో వెళ్లి చూడగా పెద్ద నాగుపాము వారింట్లో బుసలు కొడుతూ కనిపించింది. దీంతో ఆయన దానిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బుసలు కొడుతున్న కోడెనాగు అతని శరీరంపై మూడు సార్లు కాటేసింది. అంతే, ఓరన్ కు కోపం ముంచుకొచ్చింది. దానిని పట్టుకుని, కసిదీరా నోటితో కొరికి ముక్కలు ముక్కలు చేసేశాడు. అయితే, పాము కాటుకు గురైన ఓరన్ శరీరంలోకి విషం వ్యాపించడంతో కుప్పకూలిపోయాడు. భయాందోళనలకు గురైన ఓరన్ కుటుంబ సభ్యులు అతనిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో వైద్యం చేసినా ఫలితం లేకుండా పోయింది. విషాదకరమైన ట్విస్ట్ ఓరన్ ప్రాణాలను పైకి పంపించేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ