ముంబైకి చెందిన పద్మా అయ్యర్ తన గే కొడుకు కోసం ఇచ్చిన వరుడి ప్రకటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మునుపెన్నడు ఇలాంటి ప్రకటన లేకపోవటంతో యావత్ దేశం మొత్తం దీనిపై చర్చ జరిగింది. అయితే ఈ ప్రకటనకు క్రేజ్ తోపాటు రెస్పాన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చిందట. సుమారు 73 మంది ఈ ప్రకటనపై స్పందించి ముందుకు వచ్చారట. వారిలో అబుదాబికి చెందిన ఓ వ్యక్తయితే ఏకంగా రాజభవనం లాంటి ఇల్లు అతనికి రాసిస్తానని ముందుకు వచ్చాడట. యూకే, ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన పలువురు ధనికులు కూడా స్పందించారట. మరీ ముఖ్యంగా తన ప్రకటనకు స్పందించిన వారిలో అయ్యర్లే అధికంగా ఉన్నారని పద్మ తెలిపారు. మిగతావారిలో గుజరాతీలు, ముస్లింలు ఉన్నారని చెప్పారు.