గోమాతను కాపాడిన ముస్లిం కుర్రాడు

October 05, 2015 | 01:19 PM | 2 Views
ప్రింట్ కామెంట్
muslim-save-cow-in-lucknow-from-well-niharonline

ఓవైపు మతోన్మాదం వికృత క్రీడ చేస్తున్నా మానవత్వం చచ్చిపోలేదని నిరూపించాడా యువకుడు. గోమాంసం పై నిషేధం ఉండగా గోవులను చంపి తింటున్నారని ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి. మరీ దారుణంగా ప్రాణాలు సైతం తీస్తున్నారు. కానీ, అదే వర్గానికి చెందిన ఓ యువకుడు ఓ ఆవు ప్రాణాలు కాపాడి తన మానవత్వాన్ని చాటుకున్న ఘటన లక్నో సమీపంలో జరిగింది.

ఓ ఆవు 35 అడుగుల లోతైన బావిలో పడిపోయి నిస్సహాయంగా అరుస్తుంది. దాన్ని కాపాడే సాహసం చేయలేక అందరూ చూస్తున్న వేళ, 20 సంవత్సరాల మహమ్మద్ జకీ ముందు వెనకా ఆలోచించకుండా దూకాడు. గోమాతను కాపాడేందుకు తన ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. క్రేన్ వచ్చేంతవరకు అది మునిగిపోకుండా ఆపాడు. చివరికి క్రేన్ వచ్చాక ఆ ఆవుని వెలుపలికి తీసుకొచ్చి అందరితో ప్రశంసలు పొందాడు. "ఆ ఆవు ప్రాణాల కంటే నాకు ఏదీ ఎక్కువా అనిపించలేదు. అప్పటికే దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ ఆవు నాపై దాడి చేసింది. నా కాలును బలంగా తన్నింది. అయినా పట్టు విడవకుండా దాని ప్రాణాలు కాపాడాలనే నిర్ణయించుకున్నా" అని వెలుపలికి వచ్చిన తరువాత జకీ వివరించాడు.

"నా కొడుకు చదువుకున్నాడు. మిగతావారిలా ఒకటికి రెండుసార్లు ఆలోచించలేదు. బావిలోకి దిగిన తరువాత అతని ప్రాణాలపై ఆందోళన కలిగింది. చివరికి ఆవు ప్రాణాలతో బయటపడింది. సంతోషం. అని జకీ తల్లి సంతోషంతో తెలిపింది. అన్నట్లు గతేడాది రామ్ లీలా ఉత్సవాల చెలరేగిన హింసలో కూడా ఈ యువకుడు ప్రాణాలకు తెగించి చాలా మందిని కాపాడాడట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ