ఔరా! వానరం మానవత!!

December 22, 2014 | 02:51 PM | 36 Views
ప్రింట్ కామెంట్

మనం కొన్ని జంతువుల్ని చూసి భయపడతాం గానీ, నిజానికి జోలికి వెళ్ళనప్పడు అవి ఎవరినీ ఏమీ అనవనిపిస్తుంది. కోతులూ అంతే... వాటిని తరిమీ కొట్టే ప్రయత్నం చేస్తేనే అవి మనమీద దాడి చేస్తాయి. ఒక కోతిని కొడుతుంటే ఇంకొకటి వచ్చి మన మీద దాడి చేస్తాయి. అంత యూనిటీని ప్రదర్శిస్తాయి. గతంలో ఒక కోతి. తన చనిపోయిన పిల్ల బాడీని పట్టుకొని తన వెంటే తిప్పుకున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఇలాంటిదే మరో సంఘటన కాన్పూర్ లో జరిగింది. ఇది ఇంటర్ నెట్ సోషల్ నెట్ వర్క్ లో హాట్ వీడియోగా హల్ చల్ చేస్తోంది. ఒక కోతి తన స్నేహితుడిని దాదాపు ప్రాణాపాయం నుంచి బయట పడేసింది. ఒక డాక్టర్లా ప్రాణం పోసింది. ఈ వీడియో చూస్తే మనుసున్న వారెవరైనా చలించక మానరు. ఒక కోతుల మూక కాన్సూర్ రైల్వే స్టేషన్ లో గుంపుగా తిరుగుతుండగా అందులో ఒక కోతికి విద్యుత్ తీగలు తగిలి వెంటనే కిందపడిపోయింది. ఇది చూసి తోటి కోతి ఒకటి తన స్నేహితుడిని స్ర్పుహ తెప్పించడం కోసం నాకింది, కొరికింది, కొట్టింది, నీటిలో ముంచింది... కూర్చుండబెట్టి వీపుపై దబ దబ బాదింది.... విశ్వ ప్రయత్నం చేసింది.... చివరికి అది కళ్లు తెరిచి చూసే వరకూ తన ప్రయత్నం మానలేదు. స్టేషన్లో అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. కోతి ప్రయత్నం ఫలించి, అది కళ్లు తెరిచి కదలికలు ప్రారంభించగానే జనాలూ ఉత్కంఠనుంచి బయటపడి అక్కడినుంచి కదిలిపోయారు. దీన్ని చిత్రీకరించడానికి అక్కడ ఉన్న సెల్ ఫోన్లన్నీ తమ వీడియోలకు పని కల్పించాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ