గత ఏడాదిన్నర నుంచి కొనసాగుతున్న ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై ఫ్రాంఛైజీ ఓనర్ గురునాథ్ మెయ్యప్పన్ తోపాటు రాజస్థాన్ రాయల్స్ ఓనర్, శిల్పాశెట్టి భర్త అయిన రాజ్ కుంద్రాలను దోషులుగా కోర్టు పేర్కొంది. ఇక శ్రీనివాసన్ పై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని ఆయనను నిర్ధోషిగా పేర్కొంది. మరోవైపు అదే సమయంలో ఎదురుదెబ్బ వేసింది. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికల్లో శ్రీనివాసన్ ను పోటీ చేయోద్దని కోర్టు ఆదేశించింది. అంతేకాదు బీసీసీఐ చైర్మన్ పదవికి ఆరునెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. జస్టిస్ ముద్గల్ సమర్పించిన 130 పేజీల నివేదిక ఆధారంగా కోర్టు పై విధంగా తీర్పును వెలువరించింది. మరోవైపు ఐపీఎల్ నుంచి చెన్పై, రాజస్థాన్ టీంల కొనసాగింపుపై సుప్రీం తీర్పు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ చేపట్టాలని సుప్రీం ఆదేశించింది..