ఆ ఫార్మాట్ లో కూడా తోపే కానీ...

December 31, 2014 | 03:47 PM | 48 Views
ప్రింట్ కామెంట్

భారత క్రికెట్ చరిత్రలో డిసెంబర్ 30, 2014 ఓ దుర్దినం. ఆస్ట్రేలియా తో టెస్ట్ సిరీస్ చేజారడం మాట అటుంచి అంతకంటే పెద్ద షాకింగ్ న్యూస్ భారత క్రికెట్ అభిమానుల్ని విషాదంలో నింపేసింది. భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. వరుసగా పరాజయాలు పలకరించటంతోపాటు ఫామ్ లో లేని ధోనీ రిటైర్మెంట్ ప్రకటించటం పెద్ద ఆశ్చర్యపరిచే విషయమేమీ కాదు. అయినప్పటికీ టెస్ట్ లో రికార్డు స్థాయి విజయాలు అందించి టాప్ ర్యాంక్ కైవసం చేసుకోవటంతోపాటు సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా అన్ని ఫార్మాట్ లో పేరొందిన ధోనీ అర్థాంతరంగా వీడుకోలు చెప్పడం కాస్తా మింగుడు పడని విషయం. మరి అంత సక్సెస్ ఫుల్ క్రీడాకారుడి టెస్ట్ ప్రస్థానాన్ని ఓసారి లుక్కెద్దాం. దినేష్ కార్తీక్ ప్లేస్ లో టీం ఇండియాకు వచ్చిన ధోనీ 2005 శ్రీలంకతో తన తొలిటెస్ట్ ఆడి 30 పరుగులు సాధించాడు. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయ్యింది. ఇక రెండో మ్యాచ్ లో అర్థ సెంచరీ సాధించి ప్రత్యర్థి ముంద భారీ లక్ష్యం ఉంచటంలో తన వంతు పాత్ర పోషించాడు. మొత్తం 90 టెస్ట్ లు ఆడిన ధోనీ 60 మ్యాచ్ లకు కెప్టెన్సీ వహించాడు. ఓవరాల్ గా 38.09 సగటుతో 4,876 పరుగులు సాధించాడు. ఇందులో 55 అర్థ సెంచరీలు, 6 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉన్నాయి. కీపర్ గా 256 క్యాచ్ లు అందుకున్న ఈ స్కిప్పర్ శ్రీలంక ప్లేయర్ కుమార సంగక్కర ప్రపంచ రికార్డును బ్రేక్ చేశాడు. అంతేకాదు 38 స్టంప్ అవుట్ లు చేశాడు. ఆస్ట్రేలియాపై సాధించిన 224 పరుగులు వ్యక్తిగతంగా అత్యధిక స్కోర్. విశేషమేంటంటే ధోనీ సెంచరీలు సాధించిన 6 మ్యాచ్ లలో నాల్గింటిలో భారత్ విజయం సాధించగా, రెండు మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. బ్యాటింగ్ ప్రదర్శనలో యావరేజ్ మార్కులు వేయించుకున్న ధోనీ టెస్ట్ కెప్టెన్ గా మాత్రం ఎన్నో కీలక విజయాలు అందించాడు. అంతేకాదు ఎప్పటికీ దక్కదనుకున్న ఐసీసీ టెస్ట్ మొదటి ర్యాంక్ ధోనీ కెప్టెన్సీలోనే టీం ఇండియా దక్కించుకుంది. మరి ఇన్ని ఘనతలు సాధించిన ధోనీ సాధారణంగా వచ్చే విమర్శలను సీరియస్ గా తీసుకోని హఠాత్తుగా టెస్ట్ ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించటం నిజంగా బాధాకరమైన విషయమే కదా. ఆ విషయం ధోనీకి కూడా తెలుసు... అందుకేనేమో డ్రెస్సింగ్ రూమ్ లో తోటి ప్లేయర్లతో కన్నీటి వీడ్కోలు పలికాడు ఈ జార్ఖండ్ డైనమెట్. మొత్తానికి ధోనీ రిటైర్మెంట్ తో భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ శకం ముగిసినట్లయ్యింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ