కూతురి కోసం మొసలితో పోరాడింది

April 04, 2015 | 11:47 AM | 102 Views
ప్రింట్ కామెంట్
mother_saves_her_daughter_life_crocodile_niharonline

మొసలి పేరు చెబితేనే ఆమడ దూరం పరిగెడతాం కదా. అలాంటిది ఓ మహిళ ధైర్య సాహసాలు ప్రదర్శించి మొసలి బారిన పడిన కుమార్తెను రక్షించిన సంఘటన గుజరాత్ లో శుక్రవారం చోటు చేసుకుంది.  వడోదరాలోని పడ్రా పట్టణ సమీపంలోని తికారియంబరక్ గ్రామ సమీపంలోని విశ్వామిత్ర నది ప్రవహిస్తుంది. ఆ నదిలో బట్టలు ఉత్తుకునేందుకు కంతా వాంకర్ (19) ఎప్పటిలాగే శుక్రవారం కూడా నది వద్దకు చేరుకుని... బట్టలు ఉతకడం ప్రారంభించింది. అంతలో నదిలోని మొసలి ఆమె కాలును నోట కరచి అమాంతంగా నదిలోకి లాగింది. దీంతో అక్కడే ఉన్న ఆమె తల్లి దీపాలి వెంటనే స్పందించి... బట్టలు ఉతికే కర్ర తో మొసలి తలపై దాదాపు 10 నిమిషాలు ఏకధాటిగా బలంగా కొట్టింది. మొసలి కాంత వంకర్ కాలు విడిచి నదిలోకి జారుకుంది. దీపాలి వెంటనే కుమార్తెను ఆసుపత్రికి తరలించింది. వైద్యులు ఆమె చికిత్స అందించి... ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. విశ్వామిత్ర నదిలో దాదాపు 260 మొసళ్లు ఉన్నట్లు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణాంకాల ద్వారా తెలిందని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. నదిలో పరివాహక ప్రాంతంలో బట్టలు ఉతకవద్దని గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు హెచ్చరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ