మోదీ ఫేవరెట్ తిరిగి సొంత గూటికి

May 03, 2016 | 01:34 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi-and-parikar-back-to-goa-niharonline

ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత ఆప్తుడు, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ రాజీనామా చేయనున్నారా? అవుననే అంటున్నాయి పీఎంవో వర్గాలు. గోవా బీజేపీ రాజకీయాలను మలుపు తిప్పి మొదటిసారి అధికారంలోకి రావటానికి కృషి చేశాడు పారికర్. ఆయన పనితీరుకు ఫిదా అయిన మోదీ గోవా సీఎం పదవికి రాజీనామా చేయించి మరీ తన కేబినెట్ లో చేర్చుకున్నారు. అంతేందుకు కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలను ఆయనకు అప్పజెప్పారు. ఆయన అంచనాలకు తగ్గట్లుగానే పారికర్ కూడా మోదీ నమ్మకాన్ని నిలుపుకున్నారు. రక్షణ శాఖలో పలు కీలక నిర్ణయాలు అమలు జరుగుతున్న తరుణంలో పారికర్ తనదైన శైలిలో ఎలాంటి వివాదాలు లేకుండానే ఆ కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.

అయితే ఈలోగానే ఏమైందో, ఏమో తెలియదు కానీ, మోదీ కేబినెట్ నుంచి పారికర్ బయటకు వచ్చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. కేబినెట్ నుంచి బయటకు వచ్చేయడంతో పాటు తిరిగి గోవా సీఎంగా పారికర్ పదవీ బాధ్యతలు చేపడతారని అటు గోవాతో పాటు దేశ రాజధాని ఢిల్లీలోనూ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ పుకార్లను కన్ఫర్మ్ చేస్తూ పారికర్ కూడా వ్యాఖ్యలు చేశారు. ‘అవును. మూడు నాలుగు నెలల్లో తిరిగి గోవాకు వచ్చేస్తున్నాను’ అని ఆయన వ్యాఖ్యానించారు. రీ ఎంట్రీని గోవా బీజేపీ శాఖ స్వాగతిస్తున్నా అసలు పారికర్ విషయంలో మోదీ బ్యాక్ స్టెప్ కు కారణమేంటన్న విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ