ప్రధాని-పిచాయ్ భేటీ లో ఏం మాట్లాడారు?

December 18, 2015 | 12:01 PM | 1 Views
ప్రింట్ కామెంట్
google-ceo-sundar-pichai-narendra-modi-niharonline

ప్రధాని నరేంద్ర మోదీతో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సమావేశమయిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని ఎన్ఆర్ సీసీ కళాశాల విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొన్న అనంతరం ప్రధాని నివాసానికి వెళ్లారు. ఈ సమావేశం సందర్భంగా ప్రధాని, పిచాయ్ మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. కార్పోరేట్ రంగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులకు ఇరువురు సుముఖత చూపినట్లు తెలుస్తోంది.

మేకిన్ ఇండియా  గురించి ప్రధాని మోదీ, సుందర్ పిచాయ్ కు వివరించగా, గూగుల్ సంస్థ త్వరలో భారత్ లో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి, సుందర్ పిచాయ్, ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు వీరి సమావేశం కార్పొరేట్ వర్గాల్లో ఆసక్తి పెంచింది. భారీ పెట్టుబడులు భారత్ కు వస్తాయనే ఆశాభావంలో వారు ఉన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ